ముందుమాట

ఉద్దేశం

బుద్ధవచనాన్ని సుబోధకంగా అందించటానికి, దాన్ని జీవిత సమస్యల పరిష్కారానికి, దుఃఖ విముక్తికి ఆవశ్యకమైన ఒక సజీవ ధర్మంగా వివరించటానికి “బుద్ధవచనం” పత్రిక ఎంచుకున్న లక్ష్యాలు క్లుప్తంగా యివి:

 1. గౌతమ బుద్ధుని బోధనలను యథాతథంగా అందించినవని చెబుతున్న పాలి నికాయాలు, సంస్కృత ఆగమాలు తదితర మూల గ్రంథాల్లోని ప్రవచనాలను, సరళమైన తెలుగులో అందించటం.
  .
 2. గత రెండువేల సంవత్సరాలకు పైగా వివిధ బౌద్ధ యానాలు లేక శాఖలకు చెందిన పండితులు, బుద్ధవచనాన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తూ వెలువరించిన రచనలను, మూల బుద్ధవచనం వెలుగులో వాటిని వివరించే రచనలను అందించటం.
  .
 3. గత నూటయాభై సంవత్సరాలుగా, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది పండితులు, బుద్ధుని బోధనలను విశ్లేషిస్తూ, వివరిస్తూ, విమర్శిస్తూ వెలువరించిన రచనలను, వాటిని మూల బుద్ధవచనం వెలుగులో సరికొత్తగా విశ్లేషించే రచనలను అందించటం.
  .
 4. నేడు మానవుని జీవితాన్ని దుర్భరం చేస్తున్న సమస్యల మూలాలను, బుద్ధుని బోధనల వెలుగులో విశ్లేషిస్తూ, ఆ సమస్యల నివారణకు బౌద్ధం అందించే ఆచరణాత్మకమైన పరిష్కారాలను వివరించే రచనలను అందించటం.
  .
 5. పైన పేర్కొన్న వివిధ రకాల రచనల్లో, బుద్ధుని ప్రవచనాలతో సహా, ప్రకటించబడిన అభిప్రాయాలు వ్యాఖ్యలు విమర్శలపై అర్థవంతమైన చర్చకు, నిర్మాణాత్మకైన విమర్శకు తగిన వేదికను ఏర్పరచటం.

ఉద్దేశ వివరణ

రచయితలకు సూచనలు

 1. రచనలు పైన ప్రకటించిన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
  .
 2. రచనలు సాధ్యమైనత సూటిగా, స్పష్టంగా, సంక్షిప్తంగా, ప్రామాణికత కలిగి ఉండాలి.
  .
 3. రచనలను Unicode Telugu Font లో టైపుచేసి
  • Word File రూపంలో పంపవచ్చు
  • Gmail మెసేజ్ గా టైపుచేసి పంపవచ్చు
   .
 4. మీ రచనల్లో సాధ్యమైన మేరకు మీరే తప్పులు దిద్ది పంపాలి.
  .
 5. మీ రచనలకు మీరే బాధ్యత వహించాలి. వాటిపై వచ్చే సందేహాలకు, విమర్శలకు సమాధానం యివ్వగలగాలి.
  .
 6. తమ ఫోను నంబరు పత్రికలో ప్రచురించటానికి సమ్మతించే రచయితలు, ఆ విషయాన్ని తెలియజెయ్యాలి.
  .
 7. “బుద్ధవచనం” మెరుగుదల కోసం మీ సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్తున్నాం.
  .
 8. రచనలు, సలహాలు, సూచనలు పంపవలసిన ID: editor@buddhavachanam.com

రచయితలకు బుద్ధుని సూచనలు