దుక్ఖ – దుఃఖ – దుఃఖము

దుక్ఖ లేక దుఃఖ అనే పదాన్ని బౌద్ధగ్రంథాలు రెండు అర్థాల్లో ఉపయోగించాయి. 1. పరిస్థితుల్లో కలిగే మార్పు –దెబ్బ తగలటం, జబ్బు చెయ్యటం, నష్టం కలగటం, అపకీర్తి లేక నిందలకు గురికావటం మొదలైన వాటి – వలన కలిగే సాధారణమైన బాధ, అసంతృప్తి, విచారం 2. లోభం, ద్వేషం, ‘నేను’ ‘నాది’ అనే వాటిని పట్టుకుని వేళ్ళాడటం – వీటి కారణంగా ఉత్పన్నమయ్యే తీవ్రమైన బాధ, యాతన, మానసిక వేదన.

బుద్ధుడు ప్రధానంగా, పైన వివరించిన రెండవ అర్థంలో దుఃఖం గురించి వ్యవహరించాడు. నిజానికి మొదటి తరగతికి చెందినవి కూడా తప్పుడు అవగాహన వలన, అంటే లోభ ద్వేష మోహాల వలన, రెండవ రకమైన దుఃఖంగా పరిణమిస్తాయి. లోభ ద్వేష మొహాలు అంతమైతే అవి సాధారణమైన బాధగా మాత్రమే మిగులుతాయి. బుద్ధుడు కూడ సాధారణమైన బాధలను ఎదుర్కొన్నాడు, కాని అవి ఏనాడూ ఆయనకు రెండవ రకమైన దుఃఖాన్ని కలిగించలేదని బౌద్ధగ్రంథాలు చెప్పాయి.

⇐పదకోశం