‘ఈ ధర్మాలు అకుశలమైనవి, యివి నినదించదగినవి విజ్ఞులు గర్హించేవి, ఆమోదించి ఆచరిస్తే యివి కీడు దుఃఖం కలిగిస్తాయ’ని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి. ..... ‘ఈ ధర్మాలు కుశలమైనవి, యివి నిందించదగినవి కావు విజ్ఞులు ప్రశంసించేవి, ఆమోదించి ఆచరిస్తే యివి హితము సుఖము కలిగిస్తాయ’ని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని అంగీకరించి ఆచరించండి. [కాలామసుత్తం, అంగుత్తరనికాయ 3:65]